
ఆంధ్రప్రదేశ్‌లోని 100 అర్బన్ లోకల్ బాడీలకు (ULBs) ఎన్నికలు నిర్వహించేందుకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రస్తుతం 87 పురపాలక సంఘాల పాలకవర్గాల గడువు ముగియగా, మరో 13 మున్సిపాలిటీల పదవీకాలం నవంబర్‌తో ముగియనుంది.
ఎన్నికల్లో బీసీలకు 33.33 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది, అయితే ఇది సుప్రీంకోర్టు తీర్పునకు లోబడి ఉంటుందని స్పష్టం చేసింది.