
కోలీవుడ్ హీరో కార్తీ నటిస్తున్న 'సర్దార్ 2' చిత్రం సెప్టెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
పి.ఎస్. మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎస్.జె. సూర్య ప్రతినాయకుడిగా, మాళవిక మోహనన్ కథానాయికగా నటిస్తున్నారు.
ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్. లక్ష్మణ్ కుమార్ నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించి చిత్రబృందం శుక్రవారం ట్రైలర్‌ను విడుదల చేసింది.