
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగా, డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలని వైఎస్సార్‌సీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది.
విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్సీలు చంద్రశేఖర్ రెడ్డి, కల్పలత, రామ చంద్రారెడ్డి నిరసన వ్యక్తం చేశారు.
బీఏసీ సమావేశం అనంతరం అసెంబ్లీ సమావేశాలను నాలుగు రోజుల పాటు నిర్వహించాలని నిర్ణయించినట్లు అధికారులు వెల్లడించారు.