
విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన గాదె సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో సిట్ (SIT) దర్యాప్తు వేగవంతం చేసింది.
ఈ కేసులో నిందితుడిగా ఉన్న హోంగార్డును సిట్ అధికారులు అదుపులోకి తీసుకుని రిమాండ్ రిపోర్టులో కీలక ఆధారాలను పొందుపరిచారు.
మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, తదుపరి విచారణ కోసం కోర్టు అనుమతి కోరారు.