
జాంబియాలో జరుగుతున్న ఆసియన్ లెజెండ్స్ లీగ్ 2026లో ఇండియన్ రాయల్స్ జట్టు పాకిస్థాన్ పాంథర్స్‌పై 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 20 ఓవర్లలో 167 పరుగులు చేయగా, భారత్ 17.3 ఓవర్లలో 171 పరుగులు చేసి లక్ష్యాన్ని ఛేదించింది.
రిషి ధావన్ 33 బంతుల్లో 50 పరుగులు చేసి రాణించగా, చివరిలో అనురీత్ సింగ్ 6 బంతుల్లో 16 పరుగులతో నాటౌట్‌గా నిలిచి విజయాన్ని అందించాడు.