
చైనాకు చెందిన యూనిట్రీ రోబోటిక్స్ సంస్థ కేవలం మూడు నెలల వ్యవధిలోనే 'సూపర్మ్యాన్' అనే సరికొత్త హ్యూమనాయిడ్ రోబోను విజయవంతంగా అభివృద్ధి చేసింది.
ఈ రోబో నిల్చున్న చోటు నుంచే ఏకంగా 2 మీటర్ల ఎత్తుకు ఎగరగలదని, అలాగే గంటకు 45.6 కిలోమీటర్ల (సెకనుకు 12.66 మీటర్లు) గరిష్ఠ వేగంతో పరుగెత్తగలదని కంపెనీ వెల్లడించింది.
కేవలం 0.85 మీటర్ల కాళ్ల పొడవు ఉన్న ఈ రోబో వేగం, 2009లో ఉసేన్ బోల్ట్ నెలకొల్పిన గరిష్ఠ వేగం (సెకనుకు 12.42 మీటర్లు) కంటే ఎక్కువగా ఉండటం విశేషం.