శరీరంలో నీటి శాతం తగ్గడం, సూర్యుడి నుంచి వచ్చే యూవీ కిరణాలు, టీ-కాఫీలు ఎక్కువగా తాగడం వల్ల పెదాలు నల్లగా మారే అవకాశం ఉంది.
కొంతమందికి నాలుకతో పెదాలను తడపడం, కెమికల్స్ ఉన్న లిప్ బామ్స్ వాడటం వల్ల కూడా పెదవుల రంగు మారుతుందని నిపుణులు చెబుతున్నారు.
విటమిన్ల లోపం, హార్మోన్ల అసమతుల్యత, జన్యుపరమైన కారణాలు మరియు కొన్ని రకాల మందుల వాడకం కూడా పెదాలు నల్లబడటానికి దారితీస్తాయి.