
కాంగ్రెస్ నాయకులంతా వర్గ విభేదాలను పక్కనపెట్టి పార్టీ కోసం పని చేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే కొండా సురేఖ వరంగల్లో పిలుపునిచ్చారు.
కొంతమంది నాయకులు హద్దులో మాట్లాడాలని, అదుపుతప్పి మాట్లాడితే మహిళలతో కొట్టిస్తామని హెచ్చరిస్తూ ఒక్కో మహిళ నలుగురిని కొడుతుందన్నారు.
ప్రతిపక్ష నేతలు గాలిలో కత్తులు తిప్పుతున్నారని, వారిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఆమె పార్టీ శ్రేణులకు సూచించారు.