
గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న థియేటర్లలో విడుదలైన ఫహద్ ఫాజిల్ 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్', హర్ష్ రోషన్ 'తెల్ల కాగితం' చిత్రాలు ఓటీటీ వివరాలు వెలువడ్డాయి.
ఎస్.ఎస్. రాజమౌళి సమర్పణలో తెరకెక్కిన ఫాంటసీ కామెడీ చిత్రం 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్' డిజిటల్ హక్కులను నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుంది.
టీనేజ్ ప్రేమకథా చిత్రంగా తెరకెక్కిన 'తెల్ల కాగితం' డిజిటల్ హక్కులను ఈటీవీ విన్ దక్కించుకున్నట్లు సమాచారం.