
లండన్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి రూ.8 కోట్ల వరకు వసూలు చేసిన యూట్యూబర్ నందనను శంషాబాద్ ఎయిర్‌పోర్టులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
నందన దంపతులపై లుక్‌అవుట్ నోటీసులు జారీ కావడంతో, ఎయిర్‌పోర్టు పోలీసులు ఆమెను గుర్తించి ఇబ్రహీంపట్నం పోలీసులకు అప్పగించారు.
బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, నందనపై ఉన్న ఇతర కేసుల ఆధారంగా దర్యాప్తును వేగవంతం చేశారు.