
దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న 'వారణాసి' చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా 120 దేశాల్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఈ చిత్రాన్ని 50 భాషల్లో విడుదల చేయాలని నిర్ణయించిన రాజమౌళి, ఏఐ వాయిస్‌కు బదులుగా 1500 మందికి పైగా డబ్బింగ్ ఆర్టిస్టులతో ఆడిషన్లు నిర్వహించి సహజమైన గొంతులను ఎంపిక చేయనున్నారు.
శ్రీ దుర్గ ఆర్ట్స్, షోయింగ్ బిజినెస్ బ్యానర్లపై నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.