
ఫిలిప్పీన్స్‌లోని పలవాన్ ప్రాంతానికి వెళ్తున్న పడవ సముద్రం మధ్యలో అగ్నిప్రమాదానికి గురైంది.
ఈ ప్రమాదంలో ఐదుగురు మరణించగా, మరో 87 మంది ప్రయాణికులు గల్లంతయ్యారని అధికారులు వెల్లడించారు.
ప్రమాదం జరిగిన వెంటనే సహాయక చర్యలు ప్రారంభించినప్పటికీ, గల్లంతైన వారి కోసం గాలింపు కొనసాగుతోంది.