
వరంగల్‌లోని కాకతీయ మెడికల్ కాలేజీలో ఫోరెన్సిక్ మెడిసిన్ విభాగంలో మార్కుల కోసం ప్రొఫెసర్లు డబ్బులు డిమాండ్ చేశారన్న ఆరోపణలపై విచారణ జరుగుతోంది.
ప్రాక్టికల్స్‌లో పాస్ చేయాలంటే విద్యార్థులు రూ.2 లక్షలు, థీసెస్ సంతకాలకు రూ.30 వేలు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు విద్యార్థులు ఫిర్యాదు చేశారు.
ఈ వ్యవహారంపై కాలేజీ ప్రిన్సిపల్ మోహన్‌దాస్ త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసి నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు.