
వరుణ్ తేజ్ నటించిన 'కొరియన్ కనకరాజు' చిత్రం మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ. 10.20 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి బిగ్గెస్ట్ ఓపెనర్‌గా నిలిచింది.
మేర్లపాక గాంధీ దర్శకత్వంలో వచ్చిన ఈ హారర్ కామెడీ చిత్రానికి పెయిడ్ ప్రీమియర్ల నుంచి పాజిటివ్ టాక్ రావడంతో థియేటర్లలో ప్రేక్షకుల రద్దీ పెరిగింది.
ఈ సినిమా ఇప్పటికే నార్త్ అమెరికాలో 1.75 లక్షల డాలర్ల వసూళ్లను దాటగా, సోమవారం బోనాల పండుగ సెలవుతో వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.