
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఆదివారం తీవ్ర తుపానుగా మారే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది.
ఈ వాయుగుండం ప్రభావంతో రానున్న నాలుగు రోజులపాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది.
వాతావరణ శాఖ శనివారం విడుదల చేసిన ప్రకటనలో ఈ వివరాలను వెల్లడించింది.