
ఆధునిక జీవనశైలి కారణంగా రాత్రిపూట ఆలస్యంగా నిద్రపోవడం వల్ల శరీరంలోని బయలాజికల్ క్లాక్ దెబ్బతింటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
తగినంత నిద్ర లేకపోవడం వల్ల రోగనిరోధక శక్తి బలహీనపడటంతో పాటు మెదడు, గుండె ఆరోగ్యం దెబ్బతింటుందని అధ్యయనాలు పేర్కొంటున్నాయి.
అయితే అర్ధరాత్రి నిద్రపోవడం వల్ల నేరుగా క్యాన్సర్ వస్తుందనడానికి కచ్చితమైన ఆధారాలు లేవని, కానీ ఇది శరీరంపై తీవ్ర దుష్ప్రభావాన్ని చూపుతుందని స్పష్టం చేశారు.