
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు 2024 సార్వత్రిక ఎన్నికల ఫార్ములా వర్తించదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.
స్థానిక ఎన్నికల కోసం ప్రాంతాల వారీగా ప్రత్యేక వ్యూహాలను అనుసరిస్తామని, జనసేన బలంగా ఉన్న చోట పోటీ చేస్తామని ఆయన తెలిపారు.
ఎన్నికల సంసిద్ధత కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన పవన్, పార్టీ శ్రేణుల అభిప్రాయాలకు ప్రాధాన్యమిస్తామని పేర్కొన్నారు.