
ఉక్రెయిన్ డ్రోన్ దాడుల నుంచి రక్షణ చర్యలు చేపట్టని సంస్థలను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకుంటామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ హెచ్చరించారు.
జాతీయ భద్రత, ఆర్థిక స్థిరత్వంతో ముడిపడిన ఆయిల్ రిఫైనరీలు వంటి సంస్థలకు ఈ నిబంధనలు తక్షణమే వర్తిస్తాయని ప్రభుత్వం పేర్కొంది.
కోర్టు అనుమతి లేకుండానే కంపెనీలను తాత్కాలికంగా స్వాధీనం చేసుకునే అధికారం అధికారులకు కల్పిస్తూ రష్యా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.