
ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా సర్గోధా రాడార్లను గుర్తించేందుకు పంపిన లాయిటరింగ్ మ్యూనిషన్ లక్ష్యాన్ని చేరలేక కిరణా హిల్స్‌ను ఢీకొందని మాజీ సీడీఎస్ అనిల్ చౌహాన్ తెలిపారు.
భారత వైమానిక దళం మే 10న భోలారి ఎయిర్‌బేస్‌లోని హ్యాంగర్‌పై దాడి చేసిందని, ఉపగ్రహ చిత్రాల్లో హ్యాంగర్ పైకప్పుకు భారీ రంధ్రం ఏర్పడినట్లు గుర్తించామని ఆయన వెల్లడించారు.
పాకిస్థాన్ చర్చలకు ముందుకొచ్చిన సమయంలోనే సర్గోధాపై దాడికి అనుమతి ఇచ్చామని, వాతావరణం అనుకూలించక స్కార్దూ లక్ష్యాన్ని మార్చాల్సి వచ్చిందని చౌహాన్ వివరించారు.