దంతాల దృఢత్వం కోసం చీజ్, పెరుగు, పాలు, సాల్మన్, ఆకుకూరలు, యాపిల్స్, క్యారెట్లు, గుడ్లు వంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి.
క్యారెట్లను నమలడం వల్ల దవడలకు వ్యాయామం లభించి ఎనామిల్ బాగుంటుందని, దంతాలు తెల్లగా మారుతాయని నిపుణులు చెబుతున్నారు.
నిమ్మ, నారింజ వంటి విటమిన్ సి అధికంగా ఉండే ఆహారాలను మితంగా తీసుకోవడం వల్ల చిగుళ్లు ఆరోగ్యంగా ఉంటాయని సూచించారు.