
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల మూల్యాంకన అక్రమాలపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
హైదరాబాద్‌లో మూల్యాంకనం నిర్వహించడం, హాయ్‌ల్యాండ్‌కు తరలించడం, కోర్టుకు తప్పుడు అఫిడవిట్ ఇవ్వడం వంటి అంశాలపై సిట్ దర్యాప్తులో అక్రమాలు వెలుగుచూశాయని సీఎం తెలిపారు.
భవిష్యత్తులో తప్పు చేయాలంటే భయపడేలా కఠిన శిక్షలు ఉంటాయని, ఏపీపీఎస్సీని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి యువతకు అండగా ఉంటామని చంద్రబాబు అసెంబ్లీలో ప్రకటించారు.