
ఇన్వెస్కో మ్యూచువల్ ఫండ్ 'నిఫ్టీ ఇండియా డిఫెన్స్ ఇండెక్స్ ఫండ్', 'నిఫ్టీ కెమికల్ ఇండెక్స్ ఫండ్'లను ప్రవేశపెట్టింది. ఇందులో కనీసం రూ. 100 నుంచి పెట్టుబడి పెట్టవచ్చు.
కోటక్ మహీంద్రా ఏఎంసీ 'కోటక్ నిఫ్టీ క్యాపిటల్ మార్కెట్స్ ఇండెక్స్ ఫండ్'ను అందుబాటులోకి తెచ్చింది. ఇది నిఫ్టీ క్యాపిటల్ మార్కెట్స్ ఇండెక్స్‌ను ట్రాక్ చేస్తుంది.
ఈ న్యూ ఫండ్ ఆఫర్లు (NFO) సెప్టెంబర్ 29తో ముగుస్తాయని సంస్థలు తెలిపాయి. కోటక్ పథకంలో కనీసం రూ. 1,000 తో పెట్టుబడి ప్రారంభించవచ్చు.