ఇందిరమ్మ ఇళ్ల పథకం పేరుతో సైబర్ నేరగాళ్లు నకిలీ వెబ్‌సైట్లను సృష్టించి ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు గుర్తించారు.
ప్రభుత్వ పథకాల పేరుతో వచ్చే అనుమానాస్పద లింకులను క్లిక్ చేయవద్దని, వ్యక్తిగత వివరాలను ఎవరికీ ఇవ్వవద్దని సైబర్ క్రైమ్ పోలీసులు సూచించారు.
ఈ మోసాల బారిన పడకుండా ఉండటానికి అధికారిక వెబ్‌సైట్లను మాత్రమే సంప్రదించాలని అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.