
తెలంగాణలో రానున్న మూడు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది.
ఆదిలాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ సహా మొత్తం 18 జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
రాష్ట్రంలోని 70 శాతం జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో పిడుగుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు.