
భారత్-బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతంలో బీఎస్‌ఎఫ్ సిబ్బంది జరిపిన తనిఖీల్లో అక్రమంగా దాచి ఉంచిన 15.607 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
పశ్చిమ బెంగాల్-బంగ్లాదేశ్ సరిహద్దు సమీపంలో ఉన్న ఒక మహిళ నివాస గృహంపై దాడి చేసి ఈ భారీ బంగారు నిల్వలను అధికారులు పట్టుకున్నారు.
స్వాధీనం చేసుకున్న ఈ 15 కిలోల బంగారం విలువ సుమారు రూ. 25 కోట్లు ఉంటుందని సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్) అధికారులు అంచనా వేస్తున్నారు.