
యూఎస్ ఓపెన్ మూడో రౌండ్‌లో ఉజ్బెకిస్థాన్‌కు చెందిన కమిల్లా రఖిమోవాతో ఆడుతున్నప్పుడు, కోర్టు సమీపంలో గంజాయి వాసన వస్తోందని ప్రపంచ నంబర్‌వన్ అరినా సబలెంకా అంపైర్‌కు ఫిర్యాదు చేసింది.
మ్యాచ్‌లో 3-0 ఆధిక్యంలో ఉన్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకోగా, అనంతరం సబలెంకా 6-3, 6-4 స్కోరుతో విజయం సాధించి ప్రీ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది.
న్యూయార్క్‌లో 21 ఏళ్లు పైబడిన వారికి గంజాయి వినియోగం చట్టబద్ధం కావడంతో, సమీపంలోని ఫ్లషింగ్ మెడోస్-కరోనా పార్క్ ప్రాంతం నుండి ఈ వాసన వచ్చి ఉండవచ్చని భావిస్తున్నారు.