
రోజులో ఎక్కువ గంటలు కదలకుండా కూర్చోవడం వల్ల కలిగే ప్రమాదాలను కేవలం అరగంట వ్యాయామం పూర్తిగా తొలగించలేదని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
శారీరక శ్రమ లేకపోవడం, అధిక బరువు కలిసి జీవక్రియల్లో మార్పులకు దారితీసి కొన్ని రకాల క్యాన్సర్ల ముప్పును పెంచవచ్చని వివరిస్తున్నారు.
పెద్దపేగు, మూత్రపిండాలు, కాలేయం, రొమ్ము క్యాన్సర్లు సహా కనీసం 13 రకాల క్యాన్సర్లతో అధిక శరీర బరువుకు సంబంధం ఉన్నట్లు పరిశోధనలు సూచిస్తున్నాయి.