అమెరికా మధ్యవర్తిత్వంతో శాంతి చర్చలు ప్రారంభం కానున్న వేళ, ఉక్రెయిన్లోని కోమిషువాఖా గ్రామంలోని పాఠశాలపై రష్యా బాంబుల వర్షం కురిపించగా కనీసం 33 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఖార్కీవ్లోని ఒక ఆసుపత్రిపై కూడా రష్యా దాడి చేసిందని, కార్డియాలజీ విభాగంలో చికిత్స పొందుతున్నవారిలో 73 మంది గాయపడ్డారని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తెలిపారు.
వచ్చే వారం అబుదాబిలో రష్యా, ఉక్రెయిన్, అమెరికా ప్రతినిధుల మధ్య చర్చలు జరగనున్న నేపథ్యంలో ఈ దాడులు మళ్లీ తీవ్ర రూపం దాల్చడం గమనార్హం.