దేశంలో 15-29 ఏళ్ల మధ్య వయసున్న 8.7 కోట్ల మంది యువత చదువు, ఉద్యోగం లేదా నైపుణ్య శిక్షణకు దూరంగా ఉన్నారని నీతి ఆయోగ్ నివేదిక వెల్లడించింది.
కేవలం 8.25 శాతం గ్రాడ్యుయేట్లకు మాత్రమే వారి విద్యార్హతలకు తగిన ఉద్యోగాలు లభిస్తున్నాయని, పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాల కొరత ప్రధాన సమస్యగా ఉందని పేర్కొంది.
2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలంటే యువతకు తక్కువ ఖర్చుతో నైపుణ్య శిక్షణ, ఉపాధి అవకాశాలను కల్పించాలని నీతి ఆయోగ్ సూచించింది.