మన శరీరంలో సుమారు 36 లక్షల కోట్ల కణాలు నిరంతరం పనిచేస్తుంటాయని, వీటి పనితీరులో లోపం వస్తేనే వ్యాధులు మొదలవుతాయని నిపుణులు చెబుతున్నారు.
మధుమేహం, గుండె జబ్బులు, ఊబకాయం వంటి సమస్యల వెనుక కణాల ఆరోగ్యం కీలక పాత్ర పోషిస్తుందని డా. రవి కుమార్ చింత వివరించారు.
వ్యాధి వచ్చిన తర్వాత మందులు వాడటం కంటే, ఆహారం, నిద్ర, వ్యాయామం ద్వారా కణాలను ఆరోగ్యంగా ఉంచే జీవనశైలిని అలవర్చుకోవాలని సూచించారు.