
భారత్ రష్యా నుండి కొనుగోలు చేసిన ఎస్-400 గగనతల రక్షణ వ్యవస్థను గుర్తించేందుకు పాకిస్థాన్ తీవ్ర ప్రయత్నాలు చేసి విఫలమైందని రిటైర్డ్ ఎయిర్ చీఫ్ మార్షల్ జితేంద్ర సింగ్ తెలిపారు.
పాకిస్థాన్ తన యుద్ధ విమానాలు, ఇతర దేశాల శాటిలైట్లు మరియు భారత్‌లోని స్లీపర్ సెల్స్‌ను ఉపయోగించి ఈ వ్యవస్థ జాడ కోసం ప్రయత్నించింది.
2018లో భారత్ రష్యాతో ఐదు ఎస్-400 వ్యవస్థల కోసం ఒప్పందం చేసుకోగా, ఇప్పటికే నాలుగు వ్యవస్థలు భారత్‌కు చేరుకున్నాయని ఆయన వెల్లడించారు.