
నితీశ్ తివారీ దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్, సాయిపల్లవి ప్రధాన పాత్రల్లో నటించిన ‘రామాయణ’ చిత్రం విడుదలకు ముందే అడ్వాన్స్ బుకింగ్స్‌లో అద్భుతమైన స్పందన తెచ్చుకుంటోంది.
ఇప్పటికే 137 నగరాల్లో 4,339 షోలకు సంబంధించి 1.81 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడవ్వగా, రూ.10 కోట్లకు పైగా వసూళ్లు వచ్చాయి.
భారీ విజువల్స్‌తో తెరకెక్కిన ఈ చిత్రానికి ఐమ్యాక్స్‌లో విపరీతమైన డిమాండ్ ఉండటంతో కొన్ని ప్రాంతాల్లో రిక్లెయినర్ సీటు ధర రూ.3,170 వరకు పలుకుతోంది.