
ఆర్మాక్స్ మీడియా నివేదిక ప్రకారం, భారతదేశంలో ఓటీటీ వీక్షకుల సంఖ్య 66.49 కోట్లకు చేరగా, సగటున ప్రతి వీక్షకుడు వారానికి 14.9 గంటల పాటు వీడియో కంటెంట్ చూస్తున్నారు.
డబ్బు చెల్లించి చూసే యాక్టివ్ సబ్‌స్క్రిప్షన్ల సంఖ్య 17.26 కోట్లకు పెరిగిందని, ఇది గత ఏడాదితో పోలిస్తే 16 శాతం అధికమని నివేదిక పేర్కొంది.
ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉన్న టీవీ విభాగం యూజర్ల సంఖ్య 60 శాతం వృద్ధితో 20.69 కోట్లకు చేరుకుందని సంస్థ సీఈవో శైలేష్ కపూర్ తెలిపారు.