
బెండకాయ గింజలు తింటే అపెండిసైటిస్ వస్తుందనే ప్రచారంలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని వైద్యులు స్పష్టం చేశారు.
ఇది తరతరాలుగా వస్తున్న ఒక అపోహ మాత్రమేనని, గింజల్లో కరిగే ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయని తెలిపారు.
జీర్ణవ్యవస్థ బాగా బలహీనంగా ఉన్నవారు లేదా కిడ్నీలో ఆక్సలేట్ రాళ్లు ఉన్నవారు మాత్రం వీటిని మితంగా తీసుకోవాలని సూచించారు.