
దేశీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి విదేశీ పోర్ట్ఫోలియో మదుపర్ల (FPIs) నిధుల తరలింపు ధోరణి నిరంతరంగా కొనసాగుతోంది.
అక్టోబర్ నెలలో ఒక్క నెలలోనే దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి ఏకంగా రూ.34,843 కోట్ల విదేశీ సంపద వెనక్కి వెళ్లింది.
మార్కెట్లలో నెలకొన్న అనిశ్చితి పరిస్థితుల కారణంగా విదేశీ మదుపర్లు పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నట్లు మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి.