
పిఠాపురం ఏఈ తిల్లపూడి నూకరాజు కుటుంబం గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటనలో, షేక్ సాధిక్ ఖాన్ వేధింపులే కారణమని లేఖలో పేర్కొన్నారు.
సాధిక్ ఖాన్ తన అల్లుడు జగదీశ్ రెడ్డిని హత్య చేశాడని, తనను బ్లాక్ మెయిల్ చేసి ఆస్తులు లాక్కున్నాడని నూకరాజు కుమార్తె సౌజన్య లేఖలో ఆరోపించారు.
సోమవారం సాయంత్రం 6.30 గంటలకు నూకరాజు మృతదేహం రాజమహేంద్రవరం దోబీఘాట్ వద్ద లభించగా, మిగిలిన వారి కోసం ఎస్ డీ ఆర్ ఎఫ్ బృందాలు గాలింపు కొనసాగిస్తున్నాయి.