
డాక్టర్ రెడ్డీస్, నెస్లే, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సహా పలు ప్రముఖ సంస్థలకు భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (FSSAI) నోటీసులు జారీ చేసింది.
ప్రొటీన్ సప్లిమెంట్లు, కండరాల దృఢత్వం వంటి ఉత్పత్తులపై తప్పుదోవ పట్టించే ఆరోగ్య ప్రయోజనాలను ప్రచారం చేస్తున్నారనే ఆరోపణలపై ఈ చర్యలు చేపట్టారు.
వినియోగదారులను తప్పుదోవ పట్టించేలా ఉన్న ఈ క్లెయిమ్స్‌పై చట్టపరమైన చర్యలు ఎందుకు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలని ఆయా కంపెనీలను ఆదేశించారు.