
భారత మహిళా క్రికెటర్, యువ స్పిన్నర్ శ్రీ చరణి ఐసీసీ మహిళల టీ20 బౌలింగ్ ర్యాంకింగ్స్లో అగ్రస్థానాన్ని పటిష్ఠం చేసుకుంది.
తాజా ర్యాంకింగ్స్లో ఆమె 817 రేటింగ్ పాయింట్లు సాధించి మహిళల టీ20 బౌలింగ్ చరిత్రలోనే అత్యధిక రేటింగ్ రికార్డు నెలకొల్పింది.
గతంలో ఆస్ట్రేలియా బౌలర్ మేగన్ షట్ పేరిట ఉన్న 806 రేటింగ్ పాయింట్ల రికార్డును ఆమె అధిగమించింది.