
సోషల్ మీడియాలో ‘రెంట్ ఏ బాయ్‌ఫ్రెండ్’ పేరుతో జరుగుతున్న సైబర్ మోసాల పట్ల హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ ప్రజలను అప్రమత్తం చేశారు.
గంట కాఫీ మీట్‌కు రూ.499, 10 గంటల తోడుకు రూ.4,499 అంటూ ఆకర్షించి, సెక్యూరిటీ డిపాజిట్ పేరుతో బాధితుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు.
మోసపోయిన వారు వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు కాల్ చేయాలని లేదా cybercrime.gov.in పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలని సీపీ సూచించారు.