
సెర్బియాలో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో విద్యార్థులు ఏకమై స్థాపించిన స్టూడెంట్ లిస్ట్ పార్టీ 53.3 శాతం ఓట్లతో 140 స్థానాలను గెలుచుకుంది.
ప్రభుత్వం తరఫున వివిధ రకాల అణచివేత చర్యలు, బెదిరింపులు ఎదురైనప్పటికీ విద్యార్థులు శాంతియుత మార్గంలోనే ఉద్యమాన్ని కొనసాగించారు.
ఈ ఎన్నికల్లో అధ్యక్షుడు అలెక్సాండర్ వూచిచ్ మితవాద, జాతీయవాద పక్షం ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.