
పురుషుల వన్డే క్రికెట్లో అత్యంత సుదీర్ఘ కెరీర్ కలిగిన ఆటగాడిగా జింబాబ్వే వికెట్ కీపర్ బ్రెండన్ టేలర్ సచిన్ రికార్డును బద్దలు కొట్టాడు.
హరారేలో ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో బరిలోకి దిగడంతో టేలర్ వన్డే కెరీర్ 22 ఏళ్ల 148 రోజులకు చేరింది.
సచిన్ టెండూల్కర్ వన్డే కెరీర్ 22 ఏళ్ల 91 రోజులుగా ఉండగా, ఈ జాబితాలో సచిన్ రెండో స్థానానికి పడిపోయారు.