
నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియపై తమిళనాడు రాజకీయ ప్రాతినిధ్యం తగ్గకుండా అడ్డుకునేందుకు సీఎం సి. జోసెఫ్ విజయ్ శనివారం ఎంపీలతో సమావేశమయ్యారు.
ఈ భేటీకి డీఎంకే, అన్నాడీఎంకే సహా పలు పార్టీలు దూరంగా ఉండగా, కాంగ్రెస్, వీసీకే, సీపీఐ వంటి పార్టీలకు చెందిన 21 మంది ఎంపీలు హాజరయ్యారు.
దేశవ్యాప్తంగా లోక్‌సభ స్థానాలను 543 వద్దే ఉంచాలని, జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల సంఖ్యను పెంచవద్దని ఎంపీలు డిమాండ్ చేశారు.