
ఆసియా క్రీడల మహిళల హాకీ సెమీఫైనల్లో భారత్ 2-0 గోల్స్ తేడాతో దక్షిణ కొరియాను ఓడించి ఫైనల్లోకి ప్రవేశించింది.
భారత జట్టు తరఫున ఇషికా చౌదరి, కెప్టెన్ సలీమా టెటె తలా ఒక గోల్ సాధించారు.
శుక్రవారం జరిగే ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ చైనాతో భారత్ తలపడనుంది.