
కర్ణాటకకు చెందిన 15 ఏళ్ల ఆల్రౌండర్ ఉమా కశ్వి, డబ్ల్యూపీఎల్ వేలంలో అమ్ముడైన అత్యంత పిన్న వయస్కురాలిగా రికార్డు సృష్టించింది.
కొచ్చిలో జరిగిన వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ ఆమెను రూ.10 లక్షల కనీస ధరకు కొనుగోలు చేసింది.
ఉమా కశ్వి బీసీసీఐ నిర్వహించిన మహిళల అండర్-15 వన్డే టోర్నమెంట్లో మూడు సెంచరీలు సహా 516 పరుగులు సాధించింది.