
విజయవాడలో సంచలనం సృష్టించిన కల్యాణి హత్య కేసును పోలీసులు ఛేదించి, మటన్ షాప్ యజమాని షఫీతో పాటు అతనికి సహకరించిన గురువులను అరెస్ట్ చేశారు.
డబ్బుల విషయంలో తలెత్తిన వివాదంతో ఈ నెల 17న భవానీపురంలోని తన ఇంటికి తీసుకెళ్లి కత్తితో గొంతు కోసి హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో నిర్ధారణ అయింది.
హత్య అనంతరం మృతదేహాన్ని ముక్కలుగా చేసి గొల్లపూడి కూలింగ్ కెనాల్‌లో పడేసినట్లు తేలగా, నిందితులపై మరింత దర్యాప్తు కొనసాగుతోంది.