
ఆసియా క్రీడల్లో క్రికెట్ జట్ల కోసం చేసిన వసతి ఏర్పాట్లు సరిగా లేవన్న విమర్శలపై జపాన్ క్రికెట్ సంఘం సీఈవో నవోకి అలెక్స్ మియాజి స్పందించారు.
తాము కల్పించిన వసతి నచ్చని జట్లు బయట హోటళ్లలో బస చేయడానికి తమకు ఎటువంటి అభ్యంతరం లేదని ఆయన స్పష్టం చేశారు.
ఆసియా క్రీడల్లో పాల్గొనే జట్ల సౌకర్యాల విషయంలో వస్తున్న విమర్శలను ఆయన ఈ విధంగా తిప్పికొట్టారు.