
మహారాష్ట్రలోని బీడ్ జిల్లాకు చెందిన 47 ఏళ్ల రమాబాయి రణ్వీర్, తన కూతురి చదువు ఫీజు కోసం మారథాన్లో పాల్గొని విజేతగా నిలిచారు.
అంబాజోగైలో జరిగిన 'అమృత్ దౌడ్' మారథాన్లో చెప్పులు జారిపోవడంతో, ఆమె ఒట్టి కాళ్లతోనే పరుగెత్తి మొదటి స్థానాన్ని దక్కించుకున్నారు.
ఈ పోటీలో బహుమతిగా వచ్చిన రూ.3,000 నగదును తన కూతురి చదువు కోసం ఖర్చు చేయనున్నట్లు ఆమె తెలిపారు.