ఆగస్టు నెలలో సుమారు డజను కంపెనీలు ఐపీఓల ద్వారా మార్కెట్లోకి రానుండగా, మొత్తం రూ. 25,000 కోట్ల నిధులను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి.
జెప్టో వంటి ప్రముఖ స్టార్టప్‌లు కూడా ఈ జాబితాలో ఉండటంతో ఇన్వెస్టర్లలో భారీ అంచనాలు నెలకొన్నాయి.
మార్కెట్ నిపుణుల అంచనా ప్రకారం, ఈ ఐపీఓలు స్టాక్ మార్కెట్ వృద్ధికి మరియు కొత్త పెట్టుబడులకు ఊతమివ్వనున్నాయి.