
హృతిక్ రోషన్, కంగనా రనౌత్ మధ్య పదేళ్లుగా కొనసాగుతున్న వివాదం, ఇటీవల సోషల్ మీడియాలో 'సారీ హృతిక్' ట్రెండ్‌తో మరోసారి తెరపైకి వచ్చింది.
వాస్తవాలు తెలుసుకుని స్పందించాలని హృతిక్ సూచించగా, తన పేరుతో ఇతరులు వేధిస్తుంటే మౌనంగా ఉండటం సరికాదని కంగనా కౌంటర్ ఇచ్చారు.
2016లో కంగనా చేసిన 'సిల్లీ ఎక్స్' వ్యాఖ్యలతో మొదలైన ఈ వివాదం, ఇప్పటికీ సోషల్ మీడియాలో తరచూ చర్చకు దారితీస్తోంది.