
చైనాలోని కింగ్డావో బీహై షిప్‌యార్డులో గురువారం ఉదయం 11:15 గంటలకు మరమ్మతుల్లో ఉన్న 'ఓషన్ మెలోడీ' కార్గో నౌకలో మంటలు చెలరేగాయి.
ఈ ప్రమాదంలో 20 మంది మృతి చెందగా, మరో ఐదుగురు గల్లంతయ్యారని, ఐదుగురు గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని జిన్హువా వార్తా సంస్థ తెలిపింది.
ప్రమాదంపై దర్యాప్తు వేగవంతం చేయాలని, గల్లంతైన వారి కోసం సహాయక చర్యలు చేపట్టాలని అధ్యక్షుడు జిన్‌పింగ్ అధికారులను ఆదేశించారు.